Friday, November 22, 2024

ఐటీ రంగంలో ఖమ్మంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు : మంత్రి పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం జిల్లా నిరుద్యోగుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో SBIT ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. మొత్తం 150 వివిధ రంగాల కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఆయా కంపెనీలలో వివిధ హోదాల్లో ఉన్న 8200 ఉద్యోగాలకు గాను 15వేల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు కంపనీలలో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. నేడే నిర్వహిస్తున్న జాబ్ మేళాలో నేడే 5వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నారని అన్నారు. విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం పొందలేరని, అలాంటి వారికోసమే జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందన్నరు.

నేడు ఐటీ రంగంలో ఖమ్మం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాదించుకుందనారు. నిన్న విదేశాల్లో ఉన్న ఐటీ దిగ్గజాలు అయిన ప్రవాస భారతీయులతో మంత్రి కేటీఆర్ ఖమ్మం ఐటీ హబ్ గూర్చి ప్రస్తావించడం మనకు గర్వకారణం అన్నారు. యువత రాణించాలంటే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం తో పాటు వ్యాపారాల్లో సైతం ఆయా అవకాశాలు అంది పుచ్చుకోవాలని కోరారు. ఒకపుడు 53 వేల కోట్ల ఐటి రంగం ఎగుమతులు ఉండగా నేడు 1.50 కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నమన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని, మీ భాగస్వామ్యంతోనే రాబోయే తరాలకు ఇలాంటి అనేక జాబ్ మేళాలు అందించాలని కోరారు. ఒకప్పుడు మనం తిండి గింజల కోసం పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డ సందర్భాలు ఉన్నాయని, కానీ నేడు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నేడు మనమే దేశానికి తిండి గింజలు ఎగుమతి చేసి “Rice bowl of Telangana” స్థాయికి ఎదిగామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ భద్రతతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ ని సిబ్బందిని మంత్రి పువ్వాడ అభినందించారు. SBIT విద్యా సంస్థల చైర్మన్ ఆర్ జేసీ కృష్ణ, మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ ఐపీఎస్ అవినాష్ వివిధ కంపెనీల సీఈవోలు, డైరెక్టర్ లు, హెచ్ ఆర్ మేనేజర్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement