భద్రాచలం దేవస్థానం భూములు విషయంలో దేవుని స్థానం అధికారులు, సిబ్బంది, స్థానిక గ్రామస్తుల మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగింది. భద్రాచలం దేవస్థానం సిబ్బంది ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి స్థానిక రెడ్డిపాలెం గ్రామంలోని దేవస్థానం భూములు వద్ద తమకు చెందిన భూమి అంటూ అక్కడ ఉన్న జామాయిల్ చెట్లు నరకడం ఆరంభించారు. దేవస్థానం అధికారులను, సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. దేవాలయానికి చెందిన డి రవీంద్ర పై స్థానికులు దాడి చేశారు.
అటుపక్క ఎమ్మార్వో, ఎస్ఐ ఇద్దరు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో మాట్లాడి శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. దేవాలయం సిబ్బంది హక్కు ఉందంటూ జమాయిల్ చెట్లు నరకడం ఆరంభించారు. దేవాలయ సిబ్బందికి, ఎమ్మార్వో, ఎస్ఐలకు కూడా వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో రెడ్డిపాలెం గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరుకున్న స్థానికులు దేవస్థానం సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేవస్థానానికి చెందిన దండ సైతం తెగింది. ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.