భద్రాద్రి : అసమ్మతి కౌన్సిలర్లపై ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లందు మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. ప్రలోభాలకు లొంగి మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సరైంది కాదన్నారు. అసమ్మతి కౌన్సిలర్లు ప్రజా క్షేత్రంలో ఉండి పోరాడాలని సూచించారు. ఎక్కడో ఉండి వాట్సాప్‌లలో విమర్శనాత్మక మెసేజ్‌లు పెట్టడం సరికాదన్నారు. అసమ్మతి కౌన్సిలర్లు ప్రజాక్షేత్రంలోకి రాకపోతే.. రెండు,మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హరిప్రియ హెచ్చరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement