ఖమ్మం వైద్య విభాగం, ఆగస్టు 17(ప్రభ న్యూస్) : కోల్‌కతాలో ఓ వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి, ఆపై దారుణ హత్యకు నిరసనగా ఖమ్మం ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబులెన్స్ సహా భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన చేపట్టారు. ఆసుపత్రిలోనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ రక్షణ ఉంటుందని అన్నారు. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, డయాగ్నస్టిక్ సిబ్బంది పాల్గొన్నారు.