Friday, November 22, 2024

ఖ‌మ్మం కీల‌కం – రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఒకటి ప్రాంతీయ బలం.. మరొకటి జాతీయ బలం.. ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు భారీ అంచనాలు, సరికొత్త వ్యూహాలతో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి వ్యూహాలు రచిస్తుంటే, కేసీఆర్‌ను దింపడమే లక్ష్యమంటూ భారతీయ జనతా పార్టీ పరుగులు తీస్తోంది. ఇటు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొని బలాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అలుపెరుగని విధంగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఇటు ప్రాంతీయ పార్టీపై, అటు జాతీయ పార్టీపై ఆరోపణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గత ఏడాదిన్నర కాలంగా వరుస యాత్రలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా మొన్నటివరకు బహిరంగ సభలతో హోరెత్తించిన బీఆర్‌ఎస్‌ అసెంబ్లి సమావేశాల అనంతరం మౌన ప్రదర్శన చేస్తోంది. తలపండిన రాజకీయ వ్యూహకర్త సీఎం కేసీఆర్‌ మౌనం పట్ల కాంగ్రెస్‌, భాజపా వర్గాల్లో ఒకింత ఆందోళన కనిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతా హోరెత్తిన నినాదాలతో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా పాదయాత్రల సందడి కొనసాగుతోంది. దాదాపు ఏడాదిన్నరగా తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య సై అంటే సై అన్నట్లు-గా రసవత్తర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకరికి మించి మరొకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రజల మద్దతు కూడగట్టు-కునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో బలమైన పోటీ ఉండే అవకాశాలున్నందున బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ లోతైన కసరత్తు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో రెండుకు మించిన నాయకులు ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులుగా స్వయం ప్రకటనలు చేస్తుండడంతో నిలువరించేందుకు అంతర్గత ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో గత కొద్ది రోజులుగా జిల్లాల వారీగా ట్రబుల్‌ షూటర్లను వెతికే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.

చివరకు దర్యాప్తు సంస్థలను ప్రయోగించే వరకూ వెళ్లాయి. ఈ క్రమంలో కొన్ని రోజులుగా రెండు పార్టీలు సైలెంట్‌ అయ్యాయి. రాజకీయాలు స్తబ్దుగా కనిపిస్తున్నాయి. ఈ నెలలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా తెలంగాణ రాజకీయాల్లో మరింత కీలకం కానుంది. జాతీయ పార్టీ తర్వాత మొదటి బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకునే విషయంలో గులాబీ బాస్‌ కేసీఆర్‌ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు-గా భావించాలి. 2014లో వైయస్సార్‌సీపీ తరఫున ఎంపీగా గెలిచి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా మారిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. గత కొంతకాలంగా తనకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని తెెలంగాణ వైఎస్సార్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. భారాస అధిష్టానం తనను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతుందని, నిర్లక్ష్యం చేస్తుందని భావించిన ఆయన తన ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడు కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారు. మేరకు తీవ్రమైన విమర్శలతో బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. గులాబీ పార్టీని వాడడంతో పాటు పార్టీ మనుగడను విచ్చిన్నం చేసే దిశగా మంతనాలు ప్రారంభించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాపై బీఅర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.

బీఆర్‌ఎస్‌ కోణంలో ఆలోచిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతీ నియోజక వర్గంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్లు- ఆశించే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి పని చేస్తున్న వారు కొందరైతే.. 2014 పరిణామాల తర్వాత పార్టీలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నేతలు మరికొందరు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతి నియోజక వర్గంలో ఇద్దరికి మించి అభ్యర్థులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా 2014 తర్వాత జిల్లాలో చోటు- చేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోవడానికి కారణమైంది. అయితే ఈ గ్రూపు నాయకులెవరు పార్టీ అధిష్టానానికి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదిపే పరిస్థితి లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి టీ-ఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్‌, టీ-డీపీ హవానే కొనసాగింది. కానీ ఎప్పుడైతే టీ-ఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు- చేసిందో ఆ తర్వాత కేసీఆర్‌ వ్యూహాత్మక విధానాలతో కాంగ్రెస్‌, టీ-డీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్‌ పంచన చేరారు. దాంతో టీ-ఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడింది.

- Advertisement -

పొంగులేటి వెంట వైఎస్సార్‌సీపీ శ్రేణులు..
2014లో వైయస్సార్సీపీ తరఫున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీ-ఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో ఆయన వెంట వైఎస్సార్సీపీతోపాటు- కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నాయి. ఒక దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తిరుగులేని నేతగా కనిపించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రి కావడం, ఆ తర్వాత తనపై 2014లో పోటీ- చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు టీ-ఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 2019లో పొంగులేటికి టికెట్‌ రాకుండా చేయడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.

అసాధారణ రీతిలో తుమ్మలకు ప్రాధాన్యత
2014లో టీ-డీపీ తరఫున పోటీ- చేసి ఓటమిపాలైనప్పటికీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్‌ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. అసాధారణ రీతిలో ఏకంగా మంత్రిని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని కాపాడటానికి తొలుత ఎమ్మెల్సీని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను బరిలోకి దింపి ఆ సీటు-ను కాంగ్రెస్‌ ఖాతాలోంచి టీ-ఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి మళ్లించడంలో సీఎం కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీ-చేసి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై విజయం సాధించిన కందాడి ఉపేందర్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. తాజా రాజకీయాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తుమ్మల పాత్ర మరింత కీలకం కానున్నది. గతంలో మాదిరిగానే ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ తాజాగా నిర్ణయించారు.

ఖమ్మం జిల్లా పరిస్థితులపై అధినేత అప్రమత్తం
విపక్షాల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాస్త ప్రతికూలంగా మారిన రాజకీయ పరిస్థితులను చక్కదిద్దే పనిలో బీఆర్‌ఎస్‌ అధినేత నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌రావును రంగంలోకి దింపి సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వర్‌రావును పార్టీలోంచి బయటకు వెళ్ళకుండా నిలువరించగలిగారు. మొదట్లో పొంగులేటికి బీజేపీ గాలం వేయాలనుకున్న నేపథ్యంలో ఆయన, ఆయన అనుచరగణం కాషాయతీర్థం పుచ్చుకుంటు-న్నారన్న సంకేతాలు వెలబడ్డాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ జిల్లాలో కీలకంగా ఉన్న గులాబీ నేతలను అప్రమత్తం చేశారు. చాలాకాలంగా టచ్‌లో లేని తుమ్మల నాగేశ్వరరావును మళ్లీ అక్కున చేర్చుకున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను పంపించారు. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను వేదిక చేసుకోవడం వెనుక కేసీఆర్‌ వ్యూహం చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీని సుస్థిర పరుచాలని చూస్తున్న కేసీఆర్‌ ఇటీ-వల ఆ దిశగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

బల నిరూపణకు బీజేపీ తాపత్రయం
ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని వెనక్కి నెట్టి కేసీఆర్‌తో తలపడే సత్తా తమకే ఉందని చాటు-కుంటు-న్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో పేరు, పట్టు-, ప్రజల్లో అభిమానం ఉందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకుంటే ఆయన వెంట పలు నియోజకవర్గం పలువురు పార్టీలో చేరతారని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని, అందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆ బాధ్యతలను మాజీ మంత్రి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈ-టె-ల రాజేందర్‌కు అప్పగించింది. చాలా కాలంగా ఈటల రాజేందర్‌ ఇదే పని మీద ఉన్నారు. అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను ఊపేసిన మునుగోడు ఉప ఎన్నిక రావడం, జిల్లాలో బాగా పట్టు-న్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత కమలనాథుల దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement