Friday, November 22, 2024

పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మితో ఆసరా : మంత్రి పువ్వాడ

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకం ద్వారా మంజూరైన 97 మందికి చెక్కులకు గాను రూ.97.09లక్షల విలువైన చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం VDO’s కాలనీలోని క్యాంపు కార్యాలయంలో స్వయంగా పంపిణీ చేశారు. చెక్కుతో పాటు చీర, లబ్దిదారులకు ఆత్మీయ విందు భోజనం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మీ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా నేటి వరకు 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోనే నేటి వరకు రూ.66.50 కోట్ల విలువైన చెక్కలు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ గారు, MRO శైలజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, అన్ని డివిజన్ల కార్పొరేటర్ లు, నాయకులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement