భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు డివిజన్ వ్యాప్తంగా రాత్రి పది గంటల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉపరితల బొగ్గు గనుల్లో 106 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మణుగూరు సింగరేణి ఉపరితల గనుల్లోకి వర్షపు నీరు చేరింది.
ఈ వర్షపు నీటి కారణంగా బొగ్గు ఉత్పత్తికి (ఓబి) మట్టి పనులకు అంతరాయం ఏర్పడింది. ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, లక్ష 38వేల క్యూబిక్ మీటర్ల ( ఓబి) మట్టి పనులకు ఆటంకం కలిగింది.
- Advertisement -