ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకి విశేష స్పందన లభించింది. యువతీ యువకులు భారీ ఎత్తున జాబ్ మేళాలో పాల్గొన్నారు. 69కి పైగా కంపెనీలు వచ్చాయని, 5000 జాబులున్నాయని స్థానిక మేనేజర్లు, హెచ్ఆర్ లు తెలిపారు హైదరాబాద్, ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టు హెచ్ ఆర్ లు తెలుపుతున్నారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన వారికి హైదరాబాద్ లో ఎక్కువగా జాబ్ లున్నాయని చెబుతున్నారు. ఖమ్మం నుంచి తదితర కంపెనీలు రిలయన్స్, ఎస్ బి ఐ లైఫ్, అపోలో, ఆర్కా హోండా, టాటా ట్రెంట్ ఎల్టీడీ, మణప్పురం ఫైనాన్స్ ఎల్టీడీ, బ్యాంకు అఫ్ బరోడా, ఉదాన్, ఫ్యూచర్ ప్రాపర్టీ గ్రూప్, ఇన్నోవా సూపర్ ఎస్ బి ఐ కార్డ్స్, మయోర, మెట్ ప్లే, వివిధ కంపెనీలు ఉన్నాయి.
ఈ జాబ్ మేళాకు వచ్చిన జనాన్ని చూస్తే ఎంతో మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా చొరవ తీసుకొని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అదేవిధంగా ఈ జాబ్ మేళాలో ఎక్కువగా వికలాంగులు పాల్గొన్నారు. కొందరు వికలాంగులు ఆ జనంలో ఇంటర్వ్యూకి వెళ్లలేక వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. వికలాంగులకు ప్రత్యేకంగా జాబ్ మేళాను నిర్వహించి వారికీ చదువును బట్టి ఉన్న ఊరిలో ఉద్యోగం కల్పించాలని వికలాంగ నిరుద్యోగులు కోరుతున్నారు.