Tuesday, November 26, 2024

KHM: ఎన్ఆర్ఐ ఫౌండేషన్ సేవలు అభిందనీయం: కలెక్టర్ గౌతమ్ కుమార్

ఖమ్మం : కృషిభవన్ రోడ్లోని డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ (D.N.F) సంస్థ కార్యాలయం గణేష్ బోనాల నిలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ 25మంది దివ్యాంగులకు 3 లక్షల రూపాయలు విలువచేసే వీల్ చైర్స్ లను, ఎస్.బి.ఐ.టీ లో బీటెక్ చదువుతున్న నిరుపేద విద్యార్థినికి 50 వేల రూపాయలు విలువచేసే ఒక లాప్టాప్ ను అందించారు. దివ్యాంగులకు, పేద విద్యార్థులకు, నిరుపేద మహిళలకు ఎన్నారై ఫౌండేషన్ వారు వివిధ రకాల సేవలతో వారి జీవితాల్లో వెలుగులు నింపటం అభినందనీయమని ఖమ్మం జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు.

శనివారం ఉదయం ఎన్నారై ఫౌండేషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు అనేక సేవలను సహాయ కార్యక్రమాలను అందిస్తున్నప్పటికీ డిస్టిక్ ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా ఇలా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం వల్ల దివ్యాంగుల జీవితాలకు లబ్ధి చేకూరుతుందని, ఫౌండేషన్ వారు చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రస్తావిస్తూ అభినందించారు. ఎన్నారై ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుంచి జిల్లా వాసులైన అనేకమంది ఎన్నారైలు తమ వంతు సాయం అందించడం వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సాధ్యం అవుతుందని, ఇలా మాతృభూమి రుణం తీర్చుకునే అవకాశం తమకు దొరుకుతుందని ఎన్నారై ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బయ్యన బాబురావు అన్నారు.

జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ సూచన మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి తమకు అవకాశం దొరికిందని ఇంకా సుమారుగా వందమంది దివ్యాంగులకు వీల్ చైర్లు అందించడానికి సిద్ధం చేశామని ఫౌండేషన్ అధ్యక్షులు బోనాల రామకృష్ణ, ఫౌండేషన్ కార్యదర్శి బండి నాగేశ్వరరావులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 54 డివిజన్ కార్పరేటర్ మిక్కిలినేని మంజుల, మిక్కిలినేని నరేంద్ర చౌదరి, కోశాధికారి పసుమర్తి రంగారావు, కొంగర పురుషోత్తమరావు, కురివెళ్ల ప్రవీణ్, అన్నం శ్రీనివాసరావు, వాసిరెడ్డి శ్రీనివాస్, కళ్యాణపు సాంబశివరావు, అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, పద్మిని, వాసిరెడ్డి అర్జునరావు, ముదాలగర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement