భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు అధికమవుతున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు చేరింది. 9 లక్షల క్యూసెక్కులను దాటుతున్న పరిస్థితుల నేపథ్యంలో కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని, అధికారులను సన్నద్ధంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు సంబంధించి, తక్షణమే సెక్రటరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement