Friday, November 22, 2024

KHMM | జులై 7 నుంచి ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళ.. ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కే చాన్స్‌!

ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ను అందించనున్నారు. ఈ మేరకు పువ్వాడ ఫౌండేషన్ అధ్వర్యంలో Vdo’s కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక మీ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు.
18 సంవత్సరాలు నిండిన వారు టూ, త్రీ, ఫోర్ వీలర్ కోసం స్లాట్ బుక్ చేసుకుని ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ ను అందుకోవాలని అధికారులు సూచించారు.

జులై 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు (21వ తేదీ నుండి 23 వరకు రఘునాథపాలెం మండలం) ఈ లైసెన్స్ మేళాలో 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ద‌రఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియగం చేసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement