Monday, September 16, 2024

వరద ఎఫెక్ట్ : సాయంత్రం 5 నుంచి గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు బంద్

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసినా ప్రాజెక్టులు నిండుకున్నాయి. కొన్ని చోట్ల వరద ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో గేట్లన్నీ అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి వరద పెరిగింది. గంటగంటకూ వరద పెరుగుతోంది. దీంతో సాయంత్రం 5గంటల నుంచి గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నారు. 48 గంటల పాటు బ్రిడ్జిపై రవాణాను నిలిపేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలానికి మూడు వైపులా సంబంధాలు తెగిపోయాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలను వరద ముంచెత్తుతోంది.

వరద పెరుగుతుండడంతో నేటి సాయంత్రం 5 గంటల నుండి భద్రాచలం గోదావరి వంతెనపై రాకపోకలు బంద్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వరద ముంపు దృష్ట్యా రక్షణ చర్యల్లో భాగంగా రాకపోకలు బంద్ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న 48 గంటల పాటు వంతెనపై రవాణా నిలిపి వేస్తున్నామని ప్రజలు గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement