Tuesday, November 26, 2024

Kothagudem: ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి మట్టి దోపిడీ..

భద్రాచలం, సెప్టెంబర్ 6(ప్రభ న్యూస్): భద్రాచలం పట్టణానికి కూత వేటు దూరంలో గోదావరి అవతల ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి మట్టి దోపిడీ యధావిధిగా సాగుతుంది. కొందరు అధికారుల అండదండలతో దోపిడీ కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఓ రోడ్ పని కోసం ట్రాక్టర్లలో వందల ట్రిప్పుల తోలకం జరిగింది. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

ఇదే క్రమంలో భద్రాచలం పట్టణానికి చెందిన ఒక ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి సుమారుగా రెండు లక్షల రూపాయలు డిపార్ట్ మెంట్ వారికి 1400 పైగా క్యూబిక్ మీటర్ల మట్టి కోసం చెల్లింపు చేశారు. పరిశ్రమ వారికి బ్రేకులు వేయగా, ఏమి కట్టని ట్రాక్టర్లు యధావిధిగా తోలకాలు కొనసాగించాయి. దీనిపై ఏఈఈ పృథ్వీని వివరణ కోరగా… ట్రాక్టర్ వాళ్ళు తర్వాత డి.డి లు కడతారని తెలుపడం విశేషం. అధికారులకు దక్షిణ ఇచ్చిన వారి పట్ల చూసి చూడని ధోరణి, ఇతరులను కక్ష్య సాధింపులకు గురిచేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement