మణుగూరు, (ప్రభ న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలోని మణుగూరు పట్టణం లో ఒక్కసారి గా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారు జామున 4-40 గంటలకు భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు ఉలికిపడి బయటకు పరుగులు తీశారు.
గత కోద్ది రోజులు క్రితం సాయంత్రం కూడ ఇదే విధంగా భూమి ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. మణుగూరు ఏరియా ఓసి ప్రాంతం కావడంతో ఏమైనా భూమి లోపల మార్పులు జరిగాయా, అని సందేహాలకు తావు లేదు. ఉదయం సమయంలో సింగరేణి అధికారులు బ్లాస్టింగ్ చేయరు. కాగా వచ్చింది భూకంపం అనే సందేహం లో ప్రజలు అలోచనలో పడ్డారు. వరుసగా రెండోసారి భూమి కంపించడంతో రెవెన్యూ, సింగరేణి అధికారులు ధృవికరించ లేదు. భూమి కంపించడం పై అధికారులు పూర్తి స్థాయిలో, ఎందుకు భూమి కంపిస్తుందో ,ప్రజలకు మనసులో ఉన్నభయాన్ని తోలిగించాల్సి అవసరం ఉంది.