బూర్గంపహాడ్ మండల పరిధిలోని పలు గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపుకు గురవడంతో నష్టపోయిన బాధిత కుటుంబాలెవరు ఆందోళన చెందవద్దని, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ముంపుకి గురైన ప్రతి ఇంటికి రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు వచ్చి సర్వే నిర్వహించి పేర్లు నమోదు చేసుకుంటారని జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. ప్రతి బాధిత కుటుంబానికి తక్షణ సాయం క్రింద రూ.10 వేల డబ్బులు, 25 కిలోల బియ్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల ల క్రింద పప్పు, ఉల్లిపాయలు, పసుపు, కారం నూనె కూడా అందజేస్తున్నామన్నారు. వీటితో పాటు మన భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు & ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తన సొంత ఖర్చులతో సమకూర్చిన నిత్యావసర సరుకులను కూడా త్వరలోనే పంపిణీ చేయనున్నారని అన్నారు.
కొంతమంది పనికట్టుకొని మరి పునరావాస కేంద్రాల వద్ద రాసిన పేర్లుకు మాత్రమే పరిహారం అందుతుందని, ఇండ్ల వద్ద రాసిన పేర్లుకు పరిహారం అందదని దుష్ప్రచారం చేస్తున్నారని అవ్వని అపోహలని ప్రజాలేవరు వారి మాటలు నమ్మవద్దని అన్నారు. అదేకాకుండా అధికార పార్టీ వాళ్ళు చెప్పిన పేర్లు మాత్రమే రాస్తున్నారని, మిగతా వారి పేర్లు రాయడం లేదని దుష్ప్రచారం చేసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారి మాటలు కూడా నమ్మవద్దని హితవు పలికారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వరద రాజకీయాలు చేయడం తగదని కోరారు. మేమెప్పుడు ప్రజల కోసమే పని చేస్తామని, ప్రజల తరుపునే ఉంటామని, ఇది ప్రజా ప్రభుత్వామని అన్నారు. ముంపు ప్రాంతా ప్రజలు కూడా సర్వేకు వచ్చే ప్రభుత్వ అధికారులకు సహకరించి, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టకి తీసుకురావాలని కోరారు. గోదావరి ముంపునకు గురైన ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.