Friday, November 22, 2024

TG: గంజాయికి బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దు… ఏఎస్పీ అంకిత్ కుమార్

భద్రాచలం (క్రైం), జులై 18 (ప్రభ న్యూస్) : యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, డ్రగ్స్, గంజాయికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని భద్రాచలం ఎఎస్పీ అంకిత్ కుమార్ అన్నారు. భద్రాచలం పట్టణంలో మత్తు పదార్థాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గురువారం భద్రాచలం ఆటో డ్రైవర్స్ తో కలిసి స్థానిక బస్టాండ్ నుండి అంబెడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ సెంటర్ లో మానవహారం చేపట్టారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… ఎవరైనా గంజాయి అమ్మితే ఉపేక్షించేది లేదని, కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. గంజాయి అమ్మే వారి పట్ల తగిన సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, యువత గంజాయి అమ్ముతూ పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని, తీవ్ర నేరంగా పరిగణించబడుతుందన్నారు. మత్తు పదార్ధాలకు దూరంగా ఉండి యువత వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంజీవరావు, ఎస్సై విజయలక్ష్మి మధుప్రసాద్, పోలీస్ సిబ్బందితో పాటు ఆటో డ్రైవర్స్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement