జిల్లాలో జరిగిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆదివారం జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్స్, జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. కిమ్స్ కళాశాలలో కోడింగ్ ను పరిశీలించి పేపర్ బాక్సులను జిల్లా కలెక్టర్ స్వయంగా తెరిచారు. అనంతరం హాజరు వివరాలను తెలుసుకున్నారు. జ్యోతిష్మతి కళాశాలలో పరీక్షా కేంద్రాలను పరిశీలించి సహాయకురాలి ద్వారా పరీక్షను వ్రాస్తున్న విధానాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో మంచి నీటి సౌకర్యాన్ని కల్పించాలని, పరీక్ష అనంతరం పరీక్షా పత్రాలను తిరిగి పంపే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యకమంలో అదనపు కలెక్టర్ జీ.వీ. శ్యాంప్రసాద్ లాల్, అడిషనల్ సీపీ చంద్రశేఖర్ పాల్గోన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement