Friday, November 22, 2024

TS: కొత్త‌గూడెం మాతా శిశు కేంద్రంలో వైద్యుల నిర్ణ‌క్ష్యం…ఎమ్మెల్యే కూనంనేని ఆగ్ర‌హం…

కొత్తగూడెం ప్రభుత్వ మాత శిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయి తల్లి, బిడ్డ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని సింధుకి పురిటినొప్పులు రావడంతో మాత శిశు కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు.

అయితే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష్యంతో సింధు, కడుపులో వున్న నవజాతి శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెపట్టారు. సింధు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ ఘటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందించారు. కొత్తగూడెం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలోని చింతాల సింధు కుటుంబ సభ్యులను నేడు కూనంనేని పరామర్శించారు. సింధు మృతికి కారకులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

కొత్తగూడెం ప్రభుత్వ మాత శిశు ఆసుపత్రిలో జరిగిన సంఘటనను పై స్థాయి అధికారులకు తెలియజేశానని అన్నారు. కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధు అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతికి కారకులైన డాక్టర్లు, సిబ్బందిపై, ఆస్పత్రి సూపరింటెండెంట్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement