ఖమ్మం – వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటులో భాగంగా ఖమ్మంలో తలపెట్టిన సభకు అడగడుగునా ఆటంకాలు ఎదురౌతున్నాయి.. ఈ సభలను రెండు లక్షల మందితో నిర్వహించాలని ముందుగా షర్మిల టీమ్ భావించింది.. అయితే కేవలం ఆరువేల మందితో మాత్రమే సభ నిర్వహణకు ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు.. దీనికి అనుగుణంగానే ఖమ్మం పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.. తాజాగా జీవో నెంబర్ 68, 69 ప్రకారం పోలీసులు నోటీసులు షర్మిల ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ లక్కీనేని సుధీర్‌కు నోటీసులు అందజేశారు. జివోల పేర్కొన్నా నిబంధనల ప్రకారం సభ నిర్వహిస్తామని షర్మిల టీమ్ పోలీసులకు హామీ ఇచ్చింది.. కాగా 9న ఖమ్మంలో నిర్వహించబోతున్న తొలిసభలో షర్మిల కొత్తపార్టీ పేరు, పార్టీ గుర్తు, జెండా, పార్టీ నియమావళి, సిద్ధాంతాలను ప్రకటిస్తారని భావిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement