పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం అయిన నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవానికి రెడీ అయ్యింది. ఈ మేరకు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ శుక్రవారం నూతన కలెక్టరేట్ ను పరిశీలించారు. భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబంధించిన పలు పనులను పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని 55 కోట్లతో చేపడుతున్నామని, నిర్మాణం పనులు పూర్తి స్ధాయిలో కంప్లీట్ అయ్యాయని, ఫర్నీచర్ కూడా సమకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ మంత్రులకు వివరించారు.
మంత్రులు, అధికారులు భవనం మొత్తం కలియతిరిగారు. విద్యుత్ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, గ్రీనరీ, జాతీయ జెండా ప్రాంగణం, టైల్స్ పనులు పూర్తి అయ్యాయని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి వివరించారు. ఆయా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేసిన జిల్లా కలెక్టర్ ను మంత్రి పువ్వాడ అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.