బూర్గంపాడు, మే 28 (ప్రభ న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరు గ్రామం లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మంగళవారం ఆకస్మిక తనఖీ నిర్వహించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి తరగతులల్లో ఎలక్ట్రికల్ పనులు చేపట్టకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాల తిరిగి 15 రోజులలో ప్రారంభ నేపథ్యంలో సంబంధిత పనులపై సంబంధిత శాఖ అధికారులు అలసత్వం వహించటం పై మండిపడ్డారు. సంబంధిత శాఖ అధికారులకు సోకస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విద్యార్థులకు ఇచ్చే ఏక రూప దుస్తుల టిచ్చింగ్ సెంటర్ ను పరిశీలించారు. ఒక గ్రూప్ తయారుచేసి ఎప్పటికప్పుడు పనితీరుపై గ్రూపు దుస్తులు టిచ్చింగ్ విధానాన్ని పోస్ట్ చేసి అధికారులు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 7 నుండి 10 లోపు అందుబాటులోకి వచ్చే విధంగా ఏక రూపు దుస్తులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జములా రెడ్డి, ఎంఆర్ఓ ముజాహిద్, ఏపీఎం నాగార్జున్, ఎంఎన్ఓ ఎదు నరసింహరాజు, ఎంపిఓ సునీల్ కుమార్, ఏఈ శ్రీనివాసరావు, పిఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, సెక్రటరీ భవాని,తదితరులు ఉన్నారు.