Wednesday, January 22, 2025

KHM | గ్రామసభలో కాంగ్రెసోల్ల కొట్లాట

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో వారిదే పెత్తనం
కొట్లాటకు దారితీసిన వ్యవహారం


కారేపల్లి, జనవరి 22 (ఆంధ్రప్రభ) : ప్రజల కోసం నిర్వహించే ప్రజాపాలన గ్రామసభ కోమట్లగూడెంలో బుధవారం రచ్చగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే గ్రామసభ దద్దరిల్లే స్థాయిలో ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకులు గళం విప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా కాంగ్రెస్ వాళ్లే లొల్లికి దారితీయడం వివాదాస్పదంగా మారింది.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో నచ్చిన వారి పేర్లు ఎంపిక చేసుకున్నారని, నిజమైన పేదలను పట్టించుకోలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ గంగాధర్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement