Friday, November 22, 2024

KHM: ఐదుగురిపై సిటీ పోలీస్ యాక్ట్..

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు రాత్రివేళలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఐదుగురుని ఖమ్మం ఆర్బన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు. పోలీస్ పెట్రోలింగ్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలోని ధంసాలపురం బ్రిడ్జీ కింద బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఐదుగురిపై ఖానాపురం హావెలి పోలీస్ స్టేషన్ లో సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు.


పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధిగా సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని, నగరంలో సిటీ పోలీస్ యాక్ట్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, బహిరంగ మద్యపానం, పబ్లిక్ న్యూసెన్స్, రాష్ డ్రైవింగ్, రాత్రి సమయాల్లో సమయానికి మించిషాపులు తెరవడం, పనిలేకున్నా రోడ్లపై రావడం, బర్త్ డేల పేరుతో నడిరోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించేవారిపై ప్రత్యేక దృష్టి సారించి సిటీ పోలీస్ యాక్టు అమలు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అలాంటి వ్యక్తులకు జరిమానా, జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయన్నారు. ప్రధానంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement