Friday, November 22, 2024

KHM: బీఅర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి.. ఇల్లందులో ఇంటింటి ప్రచారం..

ఇల్లందు : పట్నంలోని రెండో వార్డు కౌన్సిలర్ కటకం పద్మ ఆధ్వర్యంలో వార్డులోని గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించి గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ, ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హరిప్రియ హరిసింగ్ నాయక్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల్లో ఇల్లందు ప్రాంతానికి చేసిన అభివృద్ధి మరువలేనిదన్నారు. ఇల్లందు చరిత్రలో ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే చేయని విధంగా తనదైన శైలిలో ఇల్లందు ప్రాంతానికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, చరిత్రలో మరిచిపోని విధంగా ఐదున్నర కోట్ల రూపాయలతో ఆర్టీసీ డిపో, వైద్య విధాన పరిషత్ ను వంద పడకల ఆసుపత్రిగా మార్చటంలో సఫలీకృతులయ్యారన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను దాదాపుగా 80 శాతం ప్రజలకు అందించడంలో విజయం సాధించారన్నారు. ఈనెల30వ తారీకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హరిప్రియమ్మ కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ యార్డ్ చైర్మన్, పార్టీ రాష్ట్ర నాయకులు హరి సింగ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీ పాషా, సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మమత వెంకట గౌడ్, బీఅర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు పీవీ.కృష్ణారావు, బీఅర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ అధికార ప్రతినిధి కుంటా నవాబు, బీఅర్ఎస్ పార్టీ ఆటో వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు సైదులు చాంద్ పాషా, సర్దార్, కోడి రాజేంద్ర, కోటగిరి రాజేందర్, శివ కుమార్, రేఖ, రవికుమార్, మాజీ కౌన్సిలర్ కమల్ కోరి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement