ఖమ్మం నగర పాలకసంస్థ ఎన్నికలలో పోటీ చేయాలని బిజెపి – జనసేన కూటమి పోటీ చేయాలని నిర్ణయించాయి.. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.. వరంగల్, ఇతర మునిసిపాలిటీలలో పోటీ పై ఇరు పార్టీల నేతలు సంప్రదింపులు కొనసాగుతున్నాయి.. ఈ మేరకు జనసేన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఖమ్మంలో ఏ పార్టీ ఎన్ని డివిజన్ లలో పోటీ చేయాలనే విషయంపై మరోసారి జరిగే చర్చలలో నిర్ణయిస్తామని జనసేన తెలిపింది.