Monday, November 18, 2024

TS | మహిళలతో కలిసి వరినాట్లు వేసిన భట్టి.. ఇందిర‌మ్మ రాజ్యంలో స‌మ‌స్య‌లు తీరుస్తామ‌ని భ‌రోసా!

ఖమ్మం (ప్ర‌భ న్యూస్‌): గోదావరి వరదలతో అతలాకుతలమైన కొత్త‌గూడెం జిల్లా భద్రాచలం డివిజన్ పరిధిలో ముంపు ప్రాంతాలను ఇవ్వాల (శ‌నివారం) పరిశీలించడానికి వచ్చారు సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌. స్థానిక ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో కలిసి భద్రాచలం నుండి దుమ్ముగూడెం వెళ్ళే మార్గం మధ్యలో పాత నారాయణపేట వద్ద వరి నాట్లు వేస్తున్న మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకొని వారితో కలిసి భట్టి విక్రమార్క వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా మహిళలు వారి సమస్యలు ఏకరువు పెట్టారు.

వీరభద్రమ్మ అనే మహిళ తాను బీఎస్సీ నర్సింగ్ చేసి ఉద్యోగ అవకాశాలు లేక కూలీ పనులు చేస్తున్న‌ట్టు తెలిపింది. మరో మహిళ కురం నాగమణి తాను కూడా బీకాం కంప్యూటర్స్ చేసి కూలీ పనులతో జీవనం వెళ్లదీస్తున్నట్టు చెప్పింది. అలాగే మరి కొందరు ఐటీడీఏ నుండి త‌మ‌కు బోర్లు వేసుకోడానికి ఎటువంటి నిధులు అందడం లేదని విన్నవించారు. వారి సమస్యలు సావదానంగా విన్న భట్టి విక్రమార్క మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంద‌ని, అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా నిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement