Tuesday, November 19, 2024

క‌మ‌నీయం భ‌ద్రాద్రి రాముడి క‌ల్యాణం…..

భ‌ద్రాచ‌లం : భ‌ద్రాచ‌ల క్షేత్రంలో శ్రీ సీతారాముల క‌ల్యాణం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. అభిజిత్ ల‌గ్నంలో సీతారాముల క‌ల్యాణ వేడుక క‌మ‌నీయంగా సాగింది. స‌రిగ్గా ప‌న్నెండు గంట‌ల‌కు జిల‌క‌ర్ర‌, బెల్లం పెట్టారు. అనంత‌రం మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఈ క‌మ‌నీయ వేడుక రామ భ‌క్తుల్ని ఆనంద పార‌వ‌శ్యంలో ముంచెత్తింది. క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తులు లేకుండానే ఈ క‌ల్యాణాన్ని ఆల‌య ప్రాంగ‌ణంలో నిర్వ‌హించారు.. రాములోరి క‌ల్యాణానికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్ర్తాలు, ముత్యాల త‌లంబ్రాల‌ను మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ దంప‌తులు స‌మ‌ర్పించారు. ఇవాళ క‌ల్యాణం ముగియ‌డంతో రేపు శ్రీరామ‌చంద్రుడి ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. కొవిడ్ కార‌ణంగా పూజ‌లు, తీర్థ ప్ర‌సాదాలు నిలిపివేశారు. ఈ వేడుక‌ల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దంపతులు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్ దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్ దంపతులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సరస్వతి ఉపాసకులు డైవజ్ఞశర్మతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement