నెల రోజుల్లో సమస్యలు పరిస్కరిస్తాము
స్థానిక ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
ఇల్లందు : జిల్లాలో వున్న ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ తెలిపారు. ఇవాళ స్థానిక ప్రభుత్వ వైద్య శాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాల పరిసరాలను, రోగులకు అందుతున్న వైద్యం, వైద్యశాలలో వున్న పరికరాలను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు అవసరమైన అన్ని పరికరాలను నెల రోజుల్లో సమకూరుస్తామన్నారు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా వుండాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. వర్షాకాలం కావడం వల్ల వివిధ వ్యాధులు సోకి ప్రజలు ఇబ్బందులు పడతారని, వారికి వైద్య సిబ్బంది అన్నివేళల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వ్యాధుల పరీక్షలు అందుబాటులో ఉంచుతామని, ప్రజలు ప్రవేట్ వైద్యశాలలను ఆశ్రయించకుండా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష వర్ధన్, పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది, మునిసిపల్ చైర్మన్ డీ వి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.