ఖమ్మం, (ప్రభన్యూస్) : ఖమ్మం కార్పొరేషన్‌కు పట్టణ ప్రగతి అవార్డును ఇవ్వాల (శుక్రవారం) మంత్రి కేటీఆర్ అందజేశారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ చేతుల మీదుగా ఖమ్మం మేయర్ నీరజ, మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అందుకున్నారు. మౌళిక సదుపాయాల కల్పన విభాగంలో ఖమ్మం నగరానికి పట్టణ ప్రగతి అవార్డ్ దక్కింది.
ఉత్తమ కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్, పచ్చని మొక్కలతో కూడిన రోడ్ డివైడర్స్, వివిధ రకాల థీమ్స్ ని ప్రతిబింబించే వాల్ పెయింటింగ్స్, అత్యంత ఆహ్లాదకరమైన లకారం ట్యాoక్ బండ్, ఖానాపురం చెరువు జలాశయాల అభివృద్ధి, గోళ్లపాడు ఛానల్ సుందరీకరణ, సుందరమైన చారిత్రక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కి గాను ఈ అవార్డ్ దక్కడం గమనార్హం.