- తేజ రకం ఏసీ మిర్చి క్వింటాల్ రూ.22,300
- జాతీయస్థాయిలో ఇదే అత్యధిక ధర
- సాగు రైతును సన్మానించిన మార్కెట్ చైర్పర్సన్ డౌలే లక్ష్మి ప్రసన్న
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్ లో మరో అరుదైన రికార్డు నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి పత్తి, కంది, మక్క పెసర తదితర పంటలకు మద్దతు ధర మించి ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం ఇదే మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింఠల్ రూ 22,000 పలికిన సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరో 300 ధర పెరగడంతో క్వింటా రూ.22,300కు చేరింది. ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం గ్రామానికి చెందిన చెన్నంనేని కృష్ణ రైతు పంటకు గరిష్ఠ ధర పలికింది. ఉదయం జరిగిన జెండా పాటలు ఖరీదా ఖరీదు దారులు పంటను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డారు. దీంతో గరిష్ట ధర 22,300 చేరింది. నాణ్యమైన పంటను మార్కెట్ కు తీసుకువచ్చిన రైతును మార్కెట్ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు జిల్లాల రైతులకు ఆదెరువుగా ఉన్న ఖమ్మం మార్కెట్ లో మంచి ధర రావడం సంతోషంగా ఉందన్నారు. సాగు రైతులు నాణ్యమైన పంటలు దిగుబడి చేయడం ద్వారానే రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలో ఖమ్మం రైతుల పంట రికార్డు స్థాయి ధర రావడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో మరిన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ గ్రేడ్ టు అధికారి బజార్ అసిస్టెంట్ సెక్రటరీలు నిర్మల రాజేంద్ర ప్రసాద్ తో పాటు మిర్చిశాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశ్వరరావు, పలువురు వ్యాపారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు