Saturday, November 23, 2024

Anjanapuram – వారెంట్‌ లేని కాంగ్రెస్‌ను ఎన్నిక‌ల‌లో అడ్ర‌స్ లేకుండా చేయండి…. ప్ర‌జ‌ల‌కు కెటిఆర్ పిలుపు

కొణిజ‌ర్ల – రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాపాడుకుందామని , వ‌చ్చేఎన్నిక‌ల‌లో పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు మంత్రి కెటిఆర్ . ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా పైకి ఎదగాలని సూచించారు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారెంట్‌ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement