Monday, November 18, 2024

అంధ్ర‌ప్ర‌భ ఎఫెక్ట్ – ఖ‌మ్మం డిసిసిబి పాత పాల‌క‌ మండ‌లిపై చీటింగ్ కేసు న‌మోదు….

ఖ‌మ్మం – ఖ‌మ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ – డిసిసిబిలో రూ.10 కోట్ల నిధుల‌లో అక్రమాలు జ‌రిగాయంటూ ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌చురించిన వ‌రుస క‌థ‌నాల‌కు ఉన్న‌తాధికారులు స్పందించారు..దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపిన అధికారులు గ‌త‌ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు అక్రమంగా నిధులు మళ్లింపు, నమ్మకద్రోహం , చీటింగ్ కు పాల్పడ్డారని , అతనితో పాటు గా 21 మంది డైరక్టర్ల పై ప్రస్తుత సిఈఓ అట్లూరి వీరబాబు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వారంద‌రిపైనా 403, 406, 409 , 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా డి సి సి బి లో రూ. 10 కోట్ల నిధుల మళ్లింపు, దుర్వినియోగం కుంభకోణంపై ఆంధ్రప్రభ కథనాలు .. అక్షర సత్యాలు అయ్యాయి.. దీంతో డీసీసీబీ గత చైర్మన్ తో పాటు 21 మంది పాలకవర్గ సభ్యుల పై బ్యాంకు ప్రస్తుత చైర్మన్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు..అలాగే .ప్రొఫెషనల్ డైరెక్టర్ కనకం జనార్ధన్ ను విధులు తొలగించారు.. ఆంధ్ర‌ప్ర‌భ క‌థ‌నాల‌తో పాత క‌మిటీపై చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో రైతులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు.. వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు హార్షం వ‌క్తం చేస్తున్నారు.. ఆంధ్ర‌ప్ర‌భ‌కు అభినంద‌న‌లు తెలుపుతూ మెస్సెజ్ లు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement