భద్రాచలం : భద్రాచలం వద్ద ముప్పు పొంచి ఉంది. ఎగువ నుండి వస్తున్న వరదల వల్ల ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 66 అడుగులు వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం వద్ద శరవేగంగా గోదావరి పెరుగుతున్నదని, ప్రజలు జిల్లా యంత్రాంగంనకు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన
సూచించారు. గోదావరి 66 అడుగులకు చేరితే కరకట్ట పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బూర్గంపాడు వైపు కరకట్ట నిర్మాణం జరగలేదు. అధికారులు చెబుతున్న ప్రకారం 66 అడుగులకు గోదావరి నీటి మట్టం చేరితే భద్రాచలం పాత వంతెన పై రాకపోకలు నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముంచుకొస్తున్న ముప్పు.. గోదావరి 66 అడుగులు పెరిగే అవకాశం..
Advertisement
తాజా వార్తలు
Advertisement