ఖమ్మం – తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటులో భాగంగా ఖమ్మంలో వచ్చే నెల తొమ్మిదో తేదిన వైఎస్ షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.. ఈ సభకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు.. పెవిలియన్, ఎస్ఆర్&బిజిఎన్అర్ గ్రౌండ్ లో ఆ రోజు సభలు, సమావేశం నిర్వహించుకోవచ్చని పోలీసులు వెల్లడించారు.. ఈ సభకు లక్షమందిని సమీకరించాలని షర్మిల అభిమానులు లక్ష్యంగా పెట్టుకున్నారు.. దీని కోసం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నారు.. ఇదే సభలో షర్మిల తన పార్టీ పేరును , విధి విధానాలను ప్రకటించనున్నారు.. సభకు అనుమతి రావడంతో ఖమ్మంలో ఏర్పాట్లలో షర్మిల అభిమానులు నిమగ్నమయ్యారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement