Tuesday, November 19, 2024

ఖ‌మ్మంలో ఐటి హ‌బ్ ట‌వ‌ర్ 2కి నిర్మాణానికి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

ఫలించిన మంత్రి పువ్వాడ కృషి..రూ.36 కోట్లతో 55వేల అడుగులు
త్వరలో శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్

ఖ‌మ్మం – రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది. ఖమ్మంలో ఐటి హ‌బ్ ట‌వ‌ర్ 2 నిర్మాణ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పరిపాలనా ఉత్తర్వులు మంజూరు చేసింది. రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగులతో ప్రత్యక్షంగా 570 మంది ఒకే సారి పని చేసుకునే వేసులుబాటుతో విశాలమైన సముదాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించి తమ సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు నేడు ఐటి ట‌వ‌ర్ 2కు పరిపాలన అనుమతులు రావడంతో జిల్లా యువతలో మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు ఖమ్మం గుమ్మంలో అందుబాటులోకి రానున్నాయి. అతి త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement