Saturday, November 23, 2024

Khammam – బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం – పువ్వాడ

ఖమ్మం సిటీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ అనేక సంస్కరణలకు ఆద్యుడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు కొనియాడారు. బుధవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా గట్టయ్య సెంటర్ జిల్లా పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంబేద్కర్‌ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను కేసీఆర్ ఆదర్శంగా తీసుకుని పాలన చేశారని అన్నారు. వారి స్ఫూర్తితోనే పేద, సామాన్యులకు సంక్షేమం, అభివృద్ధి చేరువ చేశారని అన్నారు.-

పాగాల సంపత్ రెడ్డి కి నివాళులు..

బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి(55) మృతి పట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. వారి మృతి పార్టీకి తీరని లోటని, సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగడ సానుభూతిని తెలిపారు.జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్‌ఎస్‌ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.వారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని, ఎన్నికలలో గెలుపు ఓటములు సాధారణమే అన్నారు.విజయాలు వచ్చినపుడు పొంగిపోవడం.. అపజయం వచ్చినపుడు కృంగిపోవడం తమ పార్టీ నైజం కాదన్నారు.పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను, జిల్లా నాయకత్వం అన్ని వేళలా అండగా ఉంటామని, జిల్లా పార్టీ తరుపున మీకు తోడుగా ఉంటామని స్పష్టం చేశారు .కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు.. అందుకే వారికి పట్టం కట్టారని దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. మనం చేసినా.. కాంగ్రెస్ పార్టీ చేసినా ప్రజల కోసమే.. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలకు సంక్షేమం అందాలని మనస్పూర్తిగా కోరుకుందామని వివరించారు. ప్రజల తరుపున నిలచి, ప్రజల పక్షాన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి కి ఖమ్మం జిల్లా పార్టీ తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

- Advertisement -

.మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement