Mఖమ్మం : ఖమ్మం-విజయవాడ, నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి ఇరువైపులా జిల్లా సరిహద్దుల వరకు రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసేందుకు అసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుతో అన్నారు.
జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులతో గురువారం తన క్యాంప్ ఆఫీసులో రివ్యూ నిర్వహించారు. జాతీయ రహదారుల నిర్మాణాలు సాగుతున్నందున జిల్లా సరిహద్దుల వరకు సర్వీసు రోడ్డు నిర్మించే విధంగా సమగ్ర నివేదిక వెంటనే సిద్ధం చేసి అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సమర్పిస్తామన్నారు.
అదేవిధంగా ధంసలాపురం బోనకల్ రోడ్డు దగ్గర ఎగ్జిట్ మరియు ఎంట్రీ పాయింట్లు మరియు సర్వీస్ రోడ్లు కొరకు ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి అనుమతి వచ్చిందన్నారు. ఖమ్మం పట్టణంలోకి ప్రవేశం కొరకు ధంసలాపురం బోనకల్ రోడ్డు దగ్గర ఎగ్జిట్ మరియు ఎంట్రీ పాయింట్లు మరియు సర్వీస్ రోడ్లు అనుమతి వచ్చిందని..పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా నియోజకవర్గంలో పర్యటన ఉన్నందున ఖమ్మం-అశ్వారావుపేట రహదారిపై ఏర్పడిన గుంతలు పూడ్చాలని సూచించారు. వైరా బ్రిడ్జి మరమ్మతులకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు.