Friday, November 22, 2024

Khammam – తుమ్మలది ఎప్పుడూ అధర్మ పోరాటమే – పువ్వాడ

ఖమ్మం : ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ది అది నుండి అధర్మ పోరాటమే అని ఖమ్మం బీ ఆర్ ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడారు. ఖమ్మంలో పాత రుగ్మతలు ఇంకా కంటిన్యూ అవుతూ నే ఉన్నాయన్నారు. తుమ్మల నాగేశ్వర రావు కి అధర్మ పోరాటం బాగా అలవాటన్నారు. గతం లో నా మీద పోటి చేసి ఓడిపోయినప్పుడు కూడా కోర్టు లో కేస్ వేసి ఓడిపోయారని పేర్కోన్నారు. ఇప్పుడు నా నామినేషన్ ను తిరస్కరించాలని తుమ్మల పిర్యాదు చేశారన్నారు.

.తుమ్మల పిర్యాదు కు ఎన్నికల అధికారులు సమాధానం ఇచ్చారన్నారు. ఆఫీడవిట్ లో అన్ని సరిగ్గా పొందుపరచినా అయన చెప్పగానే రిటర్నింగ్ ఆఫిసర్ రద్దు చేస్తారా…అయన చెప్పినట్టు చేస్తే మంచోళ్ళు, చెయ్యకపోతే చెడ్డోళ్ళు.. అంటూ తీవ్రంగా స్పందించారు. తప్పులు ఉంటే నోటీస్ ఇస్తారు… నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు.. ఇవ్వలేదు అంటే నా నామినేషన్ సరైంది అనే గా.. నామినేషన్ దాఖలు చేసేటపుడు అక్కడ అందరూ ఉన్నారన్నారు. రిటర్నింగ్ అధికారితో పాటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఉన్నారనీ , వాళ్ళందరూ నా నామినేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఆమోదించడానికి వాల్లేమన్న నా చుట్టాలా.. అంటూ ప్రశ్నించారు. తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే నాకు ఉదయం 10.30 గంటలకే నోటీస్ ఇచ్చేవారన్నారు. నాకు అన్ని అర్హతలు ఉన్నాయి అని అధికారులు సమాధానం ఇచ్చారన్నారు.

డిపెండెన్స్ లేనప్పుడు ఎందుకు పెట్టాలి. 2018 లో చూపించా.. ఇపుడు నా కుమారుడు డిపెండెంట్ కాదు.గతంలో నా కుమారుడుకి పెళ్లి జరగలేదు, ఇప్పుడు పెళ్లి అయ్యింది. వాడికి జీతం వస్తుంది.. పెళ్ళి అయింది. ఇప్పుడు డిపెండెంట్ కాదు కాబట్టి చూపించలేదు.అఫిడవిట్ అనేది ఆస్తులు, లావాదేవీలు ఉంటే చూపించాలి. సమగ్ర సమాచారం తెలియచెప్పాలి అన్నారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేశారు. కొడంగల్ లో అతను నామినేషన్ వేసిన సెట్ లో ఏడు కాలాలు ఉన్నాయి. ఈసీ ఫార్మాట్ ప్రకారం లేదు. మీరు చెప్పేనట్టుగా చెయ్యాలి అంటే ముందుగా రేవంత్ రెడ్డి నామినేషన్ రద్దు చెయ్యాల్సి ఉంటుందన్నారు. రిటర్నింగ్ ఆఫీస్ తప్పు చేస్తే కోర్టు వెళ్లొచ్చు కానీ బెదిరించడం ఏంటి అంటూ నిప్పులు చెరిగారు. తుమ్మల కు సలహా ఇచ్చింది ఎవరో.. మీ సమయం, నా సమయం వృధా చేయడం తప్ప ఏమైన పనికొచ్చేది ఉందా అన్నారు.

. అధర్మ పోరాటం కాదు ధర్మ పోరాటం చెయ్యాలి అని తుమ్మలకు పువ్వాడ హితవు పలికారు. అబద్దపు ప్రచారం చెయ్యకండి, మీ నలభై రాజకీయ జీవితానికి మచ్చలా మిగిలిపోతుంది. గడచిన ఇన్నేళ్ల పాటు మీరు చేసింది ఇదే అంటూ హెచ్చరించారు. ఓటమిని తట్టుకోలేక ఇలా చేస్తున్నారని , దమ్ముంటే ధర్మ పోరాటం చెయ్యాలనీ సవాల్ చేశారు. వెన్ను పోటు రాజకీయాలు ఎందుకు మీకు మర్యాద అనిపించుకోదన్నారు. ఎన్నికల్లో ధైర్యంగా పోరాటం చెయ్యాలి, పిరికోడు మాత్రమే వెన్నుపోటు పొడుస్తారన్నారు. గతంలో నా మీద కేసు వేసి ఓటమి పాలయ్యారు. హుందా తనంగా ఉండాలి, ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారన్నారు.ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు, ఇది మా కర్మ అనుకుంటున్నామన్నారు. .

- Advertisement -

నేను అభ్యర్థిగా ఉన్నా .. నేను ఖమ్మం లో చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నా.. మీరు కూడా మీరు ఎం చేశారో.. ఎం చేస్తారో చెప్పి ఓట్లు అడగండి అన్నారు. నన్ను ఎదుర్కొలేకనే నా నామినేషన్ తిరస్కరించాలి అనడం హాస్యాస్పదం అన్నారు.ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా గతంలో జరిగిన విధంగానే జరగబోతుందనీ పువ్వాడ స్పష్టం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో ఆర్ జె సి కృష్ణ, డీ సీ సీ బీ చైర్మన్ కూరా కుల నాగభూషణం, ఖమర్, సుడ చైర్మన్ బచ్చ్చు విజయ్ కుమార్, నగర మేయర్ నీరజ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ దొరేపల్లి శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement