Wednesday, January 15, 2025

Khammam l పత్తి మార్కెట్‌లో అగ్ని ప్రమాదం – 400 బస్తాల కాటన్ బూడిద

ఖమ్మం పత్తి మార్కెట్‌లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు అంటుకుని దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పత్తి మార్కెట్‌కు ఈనెల 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్‌ యార్డులో ఉంచారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన పత్తి వ్యాపారులదని భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement