Tuesday, September 17, 2024

Khammam – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వరద బాధితుల నిరసన సెగ

ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పర్యటిస్తున్న కిషన్ రెడ్డికి వరదలకు తాము సర్వం కోల్పోయినా కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని నిలదీశారు వరద బాధితులు .

దీంతో పొంగులేటి వారికి నచ్చ జెప్పారు అనంతరంకిషన్ రెడ్డి, , పొంగులేటి , ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఖమ్మం బాధితుల కోసం అదనపు డిజాస్టర్ నిధులు తీసుకువస్తానని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉందని..వరద బాధితులు కష్టాల్లో ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వరద బాధితులను తప్పకుండా ఆదుకుంటుందని… క్షణాల్లో వచ్చిన భారీ వరద తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని వెల్లడించారు.

స్టేట్ డిజాస్టర్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని..ఇది ప్రకృతి వైపరీత్యం. కలిసికట్టుగా అందరూ నడవాలని కోరారు. మరోసారి తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని.. పార్టీ తరఫున వరద బాధితులకు తాత్కాలికంగా నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు.

వరద బాధితులను ఆదుకోవడానికి సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని.. రాష్ట్ర ప్రభుత్వ నుండి నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నిధులు అందిస్తామని ప్రకటించారు. SDF నిధులను గత ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకోలేదు.. యుటిలైజేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదని తెలిపారు.

- Advertisement -

అంతకుముందు ఖమ్మం ధంసలాపురంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement