Sunday, November 24, 2024

ఐజెయులో ఖమ్మం జిల్లా నుంచి భారీ చేరికలు

హైదరాబాద్ / ఖమ్మం : ఖమ్మం జిల్లాకు చెందిన టీజేఎప్, వివిధ సంఘాల నుంచి టీయూడబ్ల్యూజే(ఐజేయు) లో భారీగా చేరికలు జరిగాయి. హైదరాబాద్ లోని యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఐజేయులో చేరగా వారందరిని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు సాదరంగా ఆహ్వానించారు..
జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధనే లక్ష్యంగా టియుడబ్ల్యూజె (ఐజేయు) పని చేస్తుందని టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి కె. విరహత్ అలీ స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలు పైబడిన ఉద్యమ చరిత్ర కలిగిన ఐజేయు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చిందని ఏనాడు రాజీ ధోరణిని ప్రదర్శించ లేదన్నారు. ఆదివారం హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమ లో ఖమ్మంజిల్లాకు చెందిన వివిధ జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద సంఖ్యలో వివిధ మీడియా ప్రతినిధులు టియుడబ్ల్యూజె (ఐజేయు) లో చేరారు. విరహత్ అలీ, కె. సత్యనారాయణ, రాష్ట్రం ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ సమక్షంలో వీరంతా యూనియన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. సంఘంలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో విరాహత్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద సంఘంగా టియుడబ్ల్యూజె (ఐజేయు) తన ఖ్యాతిని నిలుపుకుంటుందన్నారు. మారిన పరిస్థితులలో జర్నలిస్టుల సమస్యల తీరు కూడా మారిందని నిరంతరం అధ్యయనం చేస్తూ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు ముందుకు సాగుతున్నామన్నారు. స్వ రాష్ట్రంలోనూ ఇండ్ల స్థలాల సమస్య, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆయన తెలిపారు. మండల స్థాయి నుంచి అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు నివాస స్థలం ఇవ్వాలని అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేవిధంగా క్యాష్ లెస్ పద్దతిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులను అందించాలని ఐజెయు డిమాండ్ చేస్తుందన్నారు. ఇందుకు అనుగుణంగా సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తూనే ఆందోళన కార్యాచరణ కూడా ప్రకటించడం జరిగిందని విరహత్ అలీ తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రాం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఐజయు సంఘానికి ఖమ్మం జిల్లా వెన్నెముఖలా నిలిచిందన్నారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొని బలియ శక్తిగా ఎదురులేని సంఘంగా నిలిచిందని ఈ నాడు చేరిన మిత్రులతో సంఘం మరింత బలోపేతమైందన్నారు. తమ పర అభిప్రాయానికి తావివ్వకుండా ఐక్యంగా ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

టియుడబ్ల్యూజె (ఐజెయు) లో చేరిన వారిలో వి6 ప్రతినిధి ఎండి ఖదీర్, దిశ బ్యూరో చీఫ్ దువ్వా సాగర్, ఏపీ24×7 ప్రతినిధి నాగేందర్రెడ్డి, వి5 రీజినల్ కో ఆర్డినేటర్ కొమ్మెర వెంకటేశ్వర్లు, విజయం సంపాదకులు పెండ్ర అంజయ్య, జి -తెలుగు బ్యూరో కొత్త యాకేష్, భారత్ టుడే ప్రతినిధి సంతోష్, సీనియర్ రిపోర్టర్ రాంచంద్రమూర్తి, జర్నలిస్ట్ సంపత్ తదితరులు ఈ సంఘంలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దొంతు రమేష్ వైట్ల, విష్ణు దాస్ శ్రీకాంత్, శంకర్ గౌడ్, రాజేష్, టియుడబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు రవీంద్రశేషు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, నాయకులు అయ్యప్ప తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement