Tuesday, October 8, 2024

Khammam – రైతుల‌కు సోలార్ ప‌వ‌ర్ – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి…

ఖ‌మ్మం – ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా చూస్తున్నామని, రైతులకి సోలార్ సిస్టం కూడా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో కరెంట్ పాత్ర చాలా ముఖ్యమైనదని, విద్యుత్ సిబ్బంది అధికారుల పాత్ర చాలా ప్రాధాన్యత వుంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ పంపు సెట్ల ను నెలరోజుల్లోనే ఇస్తానని ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ సిబ్బంది అధికారులు పొలం బాట పట్టాలని, ఇక్కడ విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వరదల ప్రభావితం అయిన ఖమ్మంలో విద్యుత్ సమస్య లేకుండా చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌ కార్మికులకు భట్టి విక్రమార్క అభినందనలు చెప్పారు. ఖమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో మంగళవారం డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, విద్యుత్ శాఖలో ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుందని.. ప్రజలు ఫోన్ చేసినప్పుడు విద్యుత్ అధికారులు స్పందించాలని వారిని ఆదేశించారు. శాఖ పరమైన సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన అన్నారు. 2029-30 నాటికి 20 వేల మెగావాట్ల విద్యత్ ఉత్పత్తికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఉపముఖ్యమంత్రి చెప్పారు. 1912 అనే ట్రోల్ ఫీ నెంబర్ కు కాల్ చేస్తే విద్యుత్ సమస్యను తీర్చే విధంగా సిస్టం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

- Advertisement -

గ్రీన్ ఎనర్జీ పవర్ ని ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందని ఆయన వివరించారు. కొత్తగా లైన్స్, పోల్స్ వేయడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. పవర్ డ్రిప్ కాకుండా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. రైతులకు పంటలతో పాటు పవర్ తో కూడా ఆదాయం వచ్చే విధంగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. గ్రామాల్లోని ఇండ్లపై కూడా సోలార్ ప్లాంట్ల్ ఏర్పాటు చేస్తాం. మధిర నియోజకవర్గంలోని సిరిపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి స్థాయి సోలార్ పవర్ ను ఏర్పాటు చేశామన్నారు భట్టి.

సబ్ స్టేషన్స్, ట్రాన్స్ఫర్మర్లు నెలలో కేటాయిస్తామని గుడ్ న్యూస్ చెప్పారు. విద్యుత్ శాఖలో పదేళ్ల నుంచి రాని పదోన్నతులు కల్పించాము. సిబ్బందికి పని భారం తగ్గించడానికి ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీ చేస్తామన్నారు. . ఆదిలాబాద్ నుంచి మొదలు ఖమ్మం సీతమ్మ సాగర్ వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు విద్యుత్ అవసరమని చెప్పారు. విద్యుత్ శాఖ లో పని చేసే వారి పిల్లల కోసం విద్యకు సంబంధించిన ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement