ఖమ్మం – రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పార్లమెంట్ లో స్వయాన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తక్షణమే ఆయన కేంద్ర హోం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అమిత్ షా రాజీనామా కోరుతూ ఖమ్మం జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత దేశం అత్యున్నత విలువలు కలిగిన ప్రజాస్వామ్య దేశంగా భారత దేశం ఉందని అన్నారు. ఈ స్వాతంత్య్ర భారత దేశంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోమ్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు.
మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రపంచ దేశంలో అత్యున్నత రాజ్యాంగం కలిగిన దేశం.. భారత దేశం అన్నారు. దేశంలో అన్ని కులాలు, మతాలు అన్న దమ్ముళ్లా కలిసి ఉంటున్నామని తెలిపారు. అమిత్ షా వ్యాఖ్యలు భారత దేశాన్ని కించపరిచేలా మాట్లాడారని అన్నారు. బీజేపీ పార్టీ ఆలోచించుకోవాలి, అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా పై తగు చర్యలు తీసుకోవాలన్నారు. భారత దేశానికి, జాతికి నిరసన తెలియజేయాలని ర్యాలీ నిర్వహించామన్నారు.