Friday, November 22, 2024

ఇచ్చిన మాట ప్రకారం కేజీ టు పీజీ విద్య.. మంత్రి కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన మాట ప్రకారం కేజీ టు పీజీ ఉచిత విద్యా సంస్థల సముదాయాన్ని ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన తొలి కేజీ టు పీజీ విద్యా సంస్థల సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… 2014 సెప్టెంబర్‌ 17న గంభీరావుపేట పర్యటనలో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేజీ టు పీజీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం నిర్మించామని తెలిపారు. విద్యను అభివృద్ధి చేసిన దేశాలే బాగు పడుతున్నాయని, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణలోనూ ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. తెలంగాణలో వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేశామని, 28 రాష్ట్రాల్లో చిన్న వయసు ఉన్న తెలంగాణ అభివృద్ధిలో మాత్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేజీ టు పీజీ విద్యా సంస్థకు తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్‌ పేరు పెట్టామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement