హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో చాలా కాలంగా పేదలకు అందకుండా నిల్చిపోయిన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులపైసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రిలీప్ఫండ్ చెక్కులను పునరుద్దరిస్తూ నిర్ణయించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొంత కాలంగా ఈ ప్రక్రియ నిల్చిపోయింది. దీంతో ఆపన్నులు అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు.
నిరుపేదల వైద్య సాయంలో కొంత సందిగ్ధత చోటుచేసుకున్నది. ఎన్నికల కోడ్ కారణంగా చెక్కులపంపిణీ నిల్చిపోయింది. అదేవిధంగా గత ప్రభుత్వం జారీ చేసి మధ్యలోనే నిలిపివేసిన 60వేల పైచిలుకు సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను కొత్త ప్రభుత్వం ఆమోదించింది. ఈ చెక్కులను జారీ చేస్తున్నారు. వీటికి జారీకి సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో చెక్కులు లబ్దిదారులకు చేరనున్నాయి.