Friday, November 22, 2024

భారాసే కీల‌కం… కేంద్రంలో సంకీర్ణం!

తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఎంతమాత్రం పనికిరావని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌ రావు దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయన్నారు. 2024లో దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు- కానుందని జోస్యం చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో బుధవారం రోజున ఎల్లారెడ్డి, బోధన్‌, నిజామాబాద్‌ నగరంలో ఏర్పాటు- చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరైన కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

దుర్మార్గమైన కాంగ్రెస్‌ వల్లనే 50 ఏళ్లకు పైగా తెలంగాణ ప్రజలు గోస పడాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ చేసిన తప్పిదం వల్లనే రెండుసార్లు జరిగిన ఉద్యమాల్లో అనేక మంది విద్యార్థులు బలి కావాల్సి వచ్చింది. తెలంగాణకు నాటి నుంచి నేటిదాకా శత్రువే కాంగ్రెస్‌ అని 2004లో కొంచెం గిలగిల అనంగనే పొత్తు పెట్టుకుందామనొచ్చినారు. మంచిదని చెప్పి మనం పొత్తు పెట్టు-కున్నాం. ఇక్కడ అక్కడ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా తెలంగాణ ఇయ్యలేదు. 14 ఏళ్లు ఏడ్పిచ్చినారు. టీ-ఆర్‌ఎస్‌ పార్టీని చీల్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినారు. ఉద్యమాన్ని ఆగం చేసి, మరోసారి ద్రోహం చేసే ప్రయత్నం చేసినారు. అందరం ఎక్కడికక్కడ పులుల్లా కొట్లాడినం కాబట్టి, కాంప్రమైజ్‌ కాలేదు కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చిండ్రని కేసీఆర్‌ వివరించారు. తొమ్మిదేళ్ళ బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికుల సమస్యలను గుర్తించి బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తున్న ఏ-కై-క రాష్ట్రం తెలంగాణ. కొత్తవారికి బీడీ పింఛన్లు రాలేదని అంటు-న్నరు. తప్పకుండ వచ్చే ఏడాది నుంచి పెంచిన లెక్కన రూ. ఐదు వేలు ఇచ్చుకుంటామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.


…ఇంకా కులం, మతం పేరిట కొట్లాటలు
ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాలేదు. ఇంకా కూడా కులం, మతం పేరిట కొట్లాటలు, పంచాయితీలు, ఝూటా వాగ్దానాలు, ఆరోపణలు, అభాండాలు… పిచ్చిపిచ్చిగా గడబిడి జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణితి రాకపోవడం. ఏయే దేశాల్లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిణితి చెందిందో ఆ దేశాలు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నాయని కేసీఆర్‌ స్పష్టం చేశారు.


ఆలోచించి ఓటేయండి
అభ్యర్థుల గుణగణాలు, అభ్యర్థి వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రతి ఎన్నికలో ప్రతి పార్టీకో మనిషి నిలబడుతారు. బీఆర్‌ఎస్‌ తరపున ఎల్లారెడ్డిలో జాజుల సురేందర్‌, బోధన్‌లో షకీల్‌ నిలబడ్డరు. కాంగ్రెస్‌ తరపున ఒకాయన నిలబడ్డాడు. బీజేపీకి కూడా ఒకరు ఉంటరు. ఇండిపెండెంట్‌గా కూడా ఒకరిద్దరు ఉండొచ్చు. ఈ అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. మంచోల్లు చెడ్డోళ్లు ఎవరు అని ఆలోచన చేయాలి. అభ్యర్థుల వెనుక ఉండే పార్టీల గురించి ఆలోచన చేయాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ ఆ గవర్నమెంట్‌ ఏర్పడతుంది. మంచి గవర్నమెంట్‌ రాకపోతే ఐదేండ్లు ఏం చేయలేం. లేనిపోని ఇబ్బందులు వస్తయి. ఏ పార్టీకి అధికారం ఇస్తే ప్రజల గురించి ఆలోచన చేస్తారని ఆలోచించి ఓటేయాలి. ప్రజలు గెలవనంత వరకు దేశం అనుకున్నంత ముందుకు పోదని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

- Advertisement -


స్వరాష్ట్రంలోనే నిజాంసాగర్‌కు పూర్వ వైభవం
నిజాంసాగర్‌కు పూర్వ వైభవం వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే స్వరాష్ట్రంలో నిజాంసాగర్‌కు పూర్వ వైభవం వచ్చింది. పాత నిజాంసాగర్‌ ఎట్లు-ండే..? ఇప్పుడు సాగర్‌ ఎలా తయారైంది…? నిజాంసాగర్‌ మూడువందల అరవై ఐదురోజులు రోజులు నిండే ఉంటది. మీ పంటలకు ఎటు-వండి డోఖా ఉండదు. దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుకు లింక్‌ చేసుకున్నాం. సింగూరు నీళ్లను హైదరాబాద్‌కు బంద్‌ చేసినం. హైదరాబాద్‌కు గోదావరి నుంచి నీళ్లు తెస్తున్నం. కాళేశ్వరం జలాలు మల్లన్నసాగర్‌ జలాలు మీకు వస్తయి. ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ కింద ప్రాంతాలకు నీళ్లు అందుతున్నయి. పాత నిజామాబాద్‌ ఎలా కళకళలాడిందో మళ్లా అట్లనే ఉంటు-న్నది. 58 ఏండ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ సాధించిన విజయం ఇది అని కేసీఆర్‌ పేర్కొన్నారు.


తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టింది
బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, ప్రజల హక్కుల కోసం, నీళ్లు, నిధుల కోసమని సీఎం కేసీఆర్‌ మరోసారి వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉంది. మరి పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో యాభై ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలి. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందేవరు..? తెలంగాణ మనది మనకు ఉండే. మంచి పంటలతోని, నిజాం రాజులు, కాకతీయ రాజులు కట్టించిన ప్రాజెక్టులు, చెరువులతో చాలా బాగుండే. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కలిపితే… ఆ చిన్న తప్పుకు 58 ఏండ్లు కొట్లాడాల్సి వచ్చిందని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
”తెలంగాణ కల్చర్‌ గంగా జమునా తెహజీబ్. హిందూ, ముస్లింలు అందరూ సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నాం. పదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు. బ్రహ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్‌ ఆర్డర్‌ పటిష్టంగా మెయిం-టె-న్‌ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్‌ఎస్‌ ముమ్మాటికి సెక్యులర్‌ పార్టీ” అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.


… బీజేపీకి ఒక్క ఓటు- వెయ్యొద్దు
”దేశంలో అనేక రాష్ట్రాలకు మెడికల్‌ కాలేజీ ఇచ్చిన మోడీ తెలంగాణకు మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు- కూడా వేయొద్దు. మనమే జిల్లాకో మెడికల్‌ కాలేజీ పెట్టు-కున్నం. ఏడాదికి తెలంగాణ రాష్ట్రం పదివేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తది. దేశ వ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలన్న చట్టాన్ని ఉల్లంఘించారు మోడీ. వంద సార్లు అడిగిన. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పారు. నేను పెట్టలేదు. పెట్టను ఏమి చేసుకుంటవో… చేసుకపో అని గట్టిగ చెప్పిన. ఇందుకు ఐదేండ్లకు రూ.25 వేల కోట్లు- కట్‌ చేసిండ్రు. బడ్జెట్‌ కట్‌ చేసి, నవోదయ, మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు- వేయాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి ఓటు- వేయాలి. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు- కూడా వేయొద్దు” అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.


ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను నేనే..
జాజుల సురేందర్‌ నా కుటు-ంబ సభ్యుడు. మంచోడు. నేను కామారెడ్డి నుంచి పోటి చేస్తున్న అంటే ఎల్లారెడ్డిని తక్కువ చేసినట్లు- కాదు. కామారెడ్డితో పాటు- ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసే బాధ్యత నాదే. మాటలు చెప్పను. రూపురేఖలు మర్చేస్త. సురేందర్‌ను గెలిపిస్తే నన్ను గెలిపించినట్లే. నేనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేస్త అని కేసిఆర్‌ ఎల్లారెడ్డి ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు.
గతంలో నిజామాబాద్‌ పట్టణం ఏ విధంగా ఉందో.. ఏ విధంగా అభివృద్ధి చెందిందో నిజామాబాద్‌ అర్బన్‌ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సీఎం కేసీఆర్‌ తెలిపారు. బోధన్‌ ఎమ్మెల్యేగా షకీల్‌ ఎంతో అభివృద్ధి చేశారు. నీళ్ళ మంత్రిగా ఉండి కూడా సుదర్శన్‌రెడ్డి పట్టించుకోలే. నిజాంసాగర్‌ కోసం ఒక్క రూపాయి తెచ్చిండ? నిజాంసాగర్‌ డిస్ట్రిబ్యూటరీలను పట్టించుకోలే. ఎమ్మెల్యే షకీల్‌ రూ.72 కోట్లు- తెచ్చి బాగు చేయించుండు. ఇట్లాంటి షకీల్‌ గెలిపించాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ సభ్యుడు సురేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement