రుద్రూర్ : ప్రజల శ్రేయస్సే కేసీఆర్ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించబోయే పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి, రూ. 15లక్షలతో నిర్మించబోయే ముదిరాజ్ సంఘం కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్డు నిర్మాణానికి శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్థానిక మండల ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గంలోని దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. అదేవిదంగా నియోజకవర్గంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి అందజేస్తున్నామన్నారు.
ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, సొసైటీ చైర్మన్ బద్దం సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు తోట సంగయ్య, గ్రామ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అక్కపల్లి నాగేందర్, ముదిరాజ్ సంఘం సభ్యులు, బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.