నిరుపేదలకు నీడ కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్‌లో నిర్మించిన 248 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉచితంగా ఇళ్లు ఇస్తున్నారన్నారు. బ్రోకర్ గాళ్లకు డబ్బులు ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 కిలోలీటర్ల నీటి సంపులను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రశాంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, కార్మొరేటర్లు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital