Friday, November 22, 2024

Tributes – దార్శనికుడు మ‌న పీవీ – కేసీఆర్

బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషాకోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. శుక్ర‌వారం పీవీ జయంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భారతజాతి ముద్దుబిడ్డ పీవీ అన్నారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ నరసింహారావు అందించిన స్ఫూర్తి మరువలేనిదని తెలిపారు.

మౌన‌ముని అయినా.. మ‌రుపురాని సేవ‌లు..

మౌనమునిగా పేరుగాంచిన పీవీ నరసింహారావు.. దేశానికి ఎనలేని సేవలు చేసినప్పటికీ కాంగ్రెస్‌ పాలకులు ఆయనను విస్మరించార‌ని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీవీకి సముచిత గౌరవాన్నిచ్చింద‌ని, ఆయన ఖ్యాతిని యావత్తు దేశానికి, ప్రపంచానికి చాటేందుకు ఎనలేని కృషి చేశామ‌ని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement