Tuesday, September 17, 2024

Tributes – అక్ష‌ర త‌ప‌స్వి కాళోజీకి కెసిఆర్ నివాళి…

బతుకంతా తెలంగాణ కోసమే అర్పించారు
తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న స్ఫూర్తి ఉంది
నిండు మ‌న‌సుతో ఆనాడు దీవించారు
భాష‌, సాహిత్యాల్లో ఎన‌లేని కృషి చేశారు
అందుకే కాళోజీ పుర‌స్కారాలు తీసుకొచ్చాం
వైద్య విశ్వ‌విద్యాల‌యానికి కాళోజీ నామ‌క‌ర‌ణం
వ‌రంగల్‌లో కాళోజీ క‌ళాకేంద్రం ఏర్పాటు
నివాళుల‌ర్పించిన మాజీ సీఎం కేసీఆర్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:
ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి (సెప్టెంబర్‌ 9) సందర్భంగా ఆయన సేవలను బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ స్మరించుకున్నారు. బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను బయలుదేరిన నాడు నిండు మనసుతో కాళోజీ దీవించారని గుర్తుచేసుకున్నారు.

కాళోజీ స్ఫూర్తిని కొన‌సాగించాం..
తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి కొనసాగే దిశగా ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటించిందని కేసీఆర్ అన్నారు. కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ భాష, సాహిత్యాల్లో విశేషంగా కృషి చేసిన సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నాం అని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టామని, వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement